317 జీవో ఉద్యోగుల జీవితాలలో ప్రశాంత లేకుండా చేసింది

*"శోకసంద్రంలో 317 బాధితులు"*

రాత్రికి రాత్రే వారం రోజుల్లో పుట్టిపెరిగిన జిల్లానే మార్చేశారు..




జిల్లాను వీడలేక, ఉద్యోగం మనలేక శోకతప్త హృదయం తో వేరే జిల్లా లో బతుకీడుస్తున్న మధ్యతరగతి ఉపాధ్యాయులు..

 317 జీవో ఉద్యోగుల జీవితాలలో ప్రశాంత లేకుండా చేసింది. వారి పిల్లల భవిష్యత్తుపై కూడా చెడు ప్రభావo చూపింది. 2009 నుంచి 2014 వరకు అనేక ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే మోసం జరిగింది,  2016లో ప్రభుత్వం కొత్త జిల్లాలు చెస్తే పరిపాలన సౌలభ్యం,పర్యవేక్షణ బాగుంటది అనుకున్నాం. 
2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తే ప్రభుత్వం ఏం చేయాలి ?  కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులను విబజన చేయాలి కానీ, 2021లో పదవి విరమణ వయసు  61 సంవత్సరాలు పెంచక పోతే 317 ప్రకారం కూడా ఉన్న జిల్లాలలో అడ్జెస్ట్ అయ్యేవారు కదా? దీనివల్ల కొత్త ఉద్యోగాలు లేవు మరియు వారికి ప్రమోషన్లు లేవు కదా? 57,59,60 సం.ల వారికి ప్రమోషన్స్ ఇచ్చి ఇప్పుడు దూరంగా పంపుతారా? వారు పని చేయగలరా? 2021 డిసెంబర్లో 317 GO కు ఆప్షన్  తీసుకొని ఒకే రోజులో ఎవరికి క్లారిటీ లేకుండా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఏదైనా పని చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి సరైన ప్రణాళిక చేయాలి కానీ అలాంటిది ఏం జరగలేదు.

ఇంత పెద్ద ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేశారు..

 సెక్రటేరియట్ ముట్టడి, ఇందిరా పార్కు, జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన, పాఠశాల వద్ద నిరసన అని రకరకాల కార్యక్రమాలు పెట్టి నిరసన తెలపడానికి పోతే పోలీసులు దొంగలను పట్టుకున్నట్లు పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు(పోలిసులు కూడా 317 victims వారు మాతో ఆఫ్ ద రికార్డ్ అంటున్నారు) ఇదేనా ఉద్యోగులను ట్రీట్ చేసే పద్ధతి. నిరసన తెలపడానికి వెళితే భార్యాభర్తలను గంటసేపు ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి. నేను నా మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తే  కారు దిగగానే పోలీసులు పట్టుకున్నారు మరి ఈ రాష్ట్రంలో రోడ్డుమీద హత్యలు చేస్తే, ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం! గొర్రెలను పంచినట్లు  ఉద్యోగులను పంచడం, అద్భుతమైన జీవో ఎవడైనా కాదంటే లాగులు పగల కొట్టండి అని చెప్పడం దేనికి సంకేతం? ఇదేనా మేము, విద్యార్థులు కూడా నేర్చుకోవలసింది? ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారం అని అందరికీ తెలుసు. మరి చర్చించకుండా ఉద్యోగుల విభజన చట్టం  తేవడం ఏమిటి ? వారి సమస్యలను పరిష్కరించకపోవడం ఏమిటి ? SC,ST లను కూడా  వారిని వారి జిల్లాలో ఉంచకుండా కొన్ని జిల్లాల్లో తక్కువ అయ్యారని, కొన్ని జిల్లాల్లో ఎక్కువ అయ్యారని పక్క జిల్లాలకు పంపి, ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో వారిని పూర్వపు జిల్లాలకు పంపడం  ఎలా ?  ఏమి పరిపాలన ? ఏమి అలకేషన్ ? ఒక్కొక్క ఉద్యోగి ఈ రోజు 140 నుంచి 300  కిలోమీటర్లు ప్రయాణించి పని చేయాల్సి వస్తుంది . అసలు జిల్లాలు వైశాల్యము పెద్దగా ఉన్నాయి పరిపాలన సౌలభ్యంగాలేదని కదా చిన్న జిల్లాలు చేసుకున్నది? అలాంటప్పుడు ఒక జిల్లా ఉద్యోగిని ఇష్టం లేకుండా మరో జిల్లాకు పంపితే అది కూడా దూర ప్రాంతాలు కేటాయిస్తే  ఎలా డ్యూటీ చేయగలరని కామన్ సెన్స్ కూడా లేదు ? అయితే వాడికి ఉన్న ఇల్లు ఇతర అ స్థిరాస్తులు ఎలా తీసుకెళ్తారు ?  మానవత్వంతో చేసిన పని కాదు.
ప్రభుత్వం తప్పు సరిద్దుకోవాలి...

సంఘాలు కూడా బాధితులను మరవడం కొసమెరుపు.










No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner