ఉపాధ్యయుల సమస్య రిష్కారం చాలు - అంతకు మించిన పదవులు లేవు-GO 317 వల్ల 32మంది ఆడ బిడ్డలు మరణించారు - గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.
317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొ.కోదండరాం గారికి ఏర్పాటుచేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ 317 సబ్ కమిటీ సభ్యులను మరొకసారి వ్యక్తిగతంగా కలుస్తూ సమస్య తీవ్రతను పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని ఇందుకోసం పనిచేస్తున్న గౌరవ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికార్లను కలిసి చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన నివేదిక రూపొందించేలా చర్చించి కాబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నివేదికను పరిశీలించి ఈనెల 15వ తేదీ లోపు ముఖ్యమంత్రి గారి నుండి సానుకూల ప్రకటన ఇప్పించేలా కృషి చేయాలని దానికోసం తాను కూడా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొ కోదండరాం గారిని కోరారు.
అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న నాలుగు ప్రధానమైన సమస్యల పరిష్కారం కావాలని అంతకుమించి తాను ఏలాంటి పదవులను ఆశించడం లేదని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతు ఒక్క 317 పోరాటంలోనే 18 కేసులను ఎదుర్కొంటున్నానని పోరాడటానికి మించిన పదవులు ఏముంటాయని తెలియజేశారు.
1. పెండింగ్లో ఉన్న డిఏలు మంజూరు చేస్తూ, ఆమోదయోగ్యమైన పిఆర్సి ఇవ్వడం.
2. 317 సమస్య పరిష్కారం, 13జిల్లాల spouse బాధితుల & web option అప్పీల్ చేసుకున్న వారికి న్యాయం చేయడం.
3. SSA మరియు KGBV లలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ MTS వర్తింప చేస్తూ వీరికి, రెసిడెన్సియల్ మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా 010 పద్ధతి కింద ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం.
4. అన్ని రకాల గురుకులాల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కారించటం.
ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు ప్రభుత్వ పెద్దలను కలిసి కృషి చేస్తానని సమస్య పరిష్కారంలో లభించే ఆనందం మరెందులోనూ ఉండదని తెలియజేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. పర్వతి సత్యనారాయణ మరియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ శంకరంపేట్ యుగంధర్ రెడ్డి గారలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment