Telangana Teacher transfer case updates Live
24-08-2023
Teacher Transfer Case Info
పిటిషనర్ ల తరపున అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ కేస్ గురించి వివరిస్తూ యూనియన్,spouse పాయింట్స్ వల్ల వివక్ష ఉందని తెలియజేసారు
అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు స్టే GO5 చట్టబద్దత మీద ఇచ్చారని తెలియజేసారు
ఇందులో Main కేస్ స్టే ఇవ్వబడిన కేస్ 3962 అని AAG గారు తెలియజేయగా, ఈ కేస్ లో ఉన్న స్టే వెకేషన్ కోసం వాదనలు ఆగస్ట్ 30 వ తేదీ న వింటామని, చీఫ్ జస్టిస్ గారు Aug 30 కి వాయిదా ఇచ్చారు
Item no 129 (WP 19795, spouse పాయింట్స్ మీద మాత్రమే వేసిన కేసు) , item 133 (WP7091/2023, ప్రమోషన్ లలో Reservation గురించి) లలో స్టే లేదు, ఎలాంటి కౌంటర్ అవసరం లేదు కాబట్టి as usual గా నెక్స్ట్ హియరింగ్ ఇచ్చారు,(ఈ కేస్ లు Aug 30 రోజు విచారణ ఉండకపోవచ్చు)
అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు Aug 30th రోజు వాదనలకు specific time ఇవ్వమని అడుగగా, ఆ రోజు ఉదయం 10.30 కి mention చేయమని సూచించారు
Aug 30 రోజు WP 3962 లో ప్రస్తుతం ఉన్న స్టే VACATE చేయడం గురించి మాత్రమే వాదనలు ఉంటాయి
23-08-2023
Teacher Transfer Case info
ఈరోజు మెడికల్ college అడ్మిషన్ల కు సంబంధించిన కేసులు ఐటెం నెంబర్ 41 నుండి 56 వరకు ఉన్న కేసులు విచారణ కోర్టు సమయం ముగిసే వరకు జరిగింది.
చివరలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు మన కేసు కు సంబంధించి వాదనలకు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు అవకాశం ఇవ్వమని అడగగా చీఫ్ జస్టిస్ గారు మెడికల్ అడ్మిషన్ లకు సంబంధించిన కేసులు ఇంకా పూర్తి కాలేదు కదా రేపు లంచ్ మోషన్ లో అవి పూర్తి అయిన తర్వాత చూద్దాం అన్నారు.
ఒకవేళ రేపు మెడికల్ కాలేజీలు మరియు అడ్మిషన్లకు సంబంధించిన కేసులు అన్ని అయిపోతే మన కేసు ఐటమ్ నెంబర్ ని బట్టి విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది
Court officer ని అడుగగా రేపటి మన కేసు ఐటెం నెంబర్ ఈరోజు 7 గంటల తర్వాత హైకోర్టు వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది అని చెప్పారు
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆప్షనల్ హాలిడే, శనివారం, ఆదివారం కోర్టుకి సెలవులు
14-08-2023
బదిలీల కేసు చిక్కుడు ప్రభాకర్, వేముగంటి మహేష్ కుమార్ కోరిక మేరకు ఆగస్టు 23 కి వాయిదా వేశారు.
చిక్కుడు ప్రభాకర్ అసెంబ్లీలో ప్లేస్ చేసిన కాపీ ఈరోజే ఇచ్చారని అభ్యంతరం తెలపగా సాంకేతిక కారణాలు పక్కన పెట్టండి…స్పౌజ్ పాయింట్స్ పై వాదించండి అన్నారు.
మహేష్ కుమార్ అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేశానని చెప్పగా ప్రతిసారీ వాయిదా కోరటమే మీ పనా అన్నారు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్, విద్యాసాగర్, రాంగోపాల్ 80 వేలమంది బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి లో స్టే ఇచ్చారు ఇంకా వాయిదా వేస్తే ఎలక్షన్ కోడ్ వస్తుంది త్వరగా తేల్చండి అని అభ్యర్థించగా ఆగస్టు 23 ఫైనల్ చేస్తామన్నారు. ఇంకెవరూ వాయిదా కోరొద్దని కూడా సూచించారు.
ఇంకెవరూ అడ్డుపుల్ల వేయకుంటే ఆగస్టు 23 న బదిలీల సంక్షోభం తొలగిపోతుందని ఆశిద్దాం.
07-08-2023
సీరియల్ నెంబర్ 30 అడ్వకేట్ గారు లేసి ఒక వారం కావాలని అడిగారు. స్క్రీన్ లో 30 పడక ముందే 29వ కేసు పూర్తి అయిన వెంబడే సీరియల్ నెంబర్ 30 అడ్వకేట్ గారు లేసి లేసి ఒక వారం పాటు వాయిదా కావాలని అడగడం జరిగింది. దానికి సిజే గారు ఒప్పుకొని ఓకే అని చెప్పారు. బదిలీలపై స్టే యధావిధిగా కొనసాగుతుంది. పోకల శేఖర్ TNSTA రాష్ట్ర అధ్యక్షులు..M. సక్కుబాయి TNSTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
03-08-2023
Tran.sfer case updates
ఈరోజు సీరియల్ నెంబర్ 29 నుండి 32 వరకు మనకు సంబంధించిన బంచ్. ఈ మంచిలో 29 నెంబర్ ఈరోజే అడ్మిట్ కావడం జరిగింది. దీనికి కౌంటర్ ఫైల్ వేయాలని చీఫ్ జస్టిస్ గారు అడగగా దానికి agp గారు గతంలోనే వేసాము అని తెలియపరచారు. ఒక నె ల పోస్ట్ పోన్ చేస్తామంటే కాదు మన అడ్వకేట్ పీవీ కృష్ణయ్య గారు ఇరువైపుల నుండి చాలా అర్జెంటుగా ఉంది కావున దయచేసి తొందర్లోనే ఇవ్వాలని కోరగా సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. పోకల శేఖర్ TNSTA రాష్ట్ర అధ్యక్షులు, M. సక్కుబాయి TNSTA ప్రధాన కార్యదర్శి.
Date: 20-07-2023
ఈ రొజు మన కేస్ గురుంచి మన advocate p v కృష్ణయ్య గారి మాటలలో . ఈరోజు ఫస్ట్ కోర్టు ఆర్గుమెంట్స్ విన్న తర్వాత ఈ రూల్స్ అనేవి కరెక్ట్ కాదు ....
గవర్నమెంట్ ఈ రూల్స్ విత్ డ్రా చేసుకొని తర్వాత ఏదన్నా గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అట్టా పాలసీ డేస్ మీద తీసుకోండి ....
కాబట్టి ఈ రూల్స్ ఒప్పుకోము..
ఈ విత్ డ్రా చేసుకోండి అని చెప్పి కోర్టు సలహా ఇచ్చింది...
అప్పుడు అడ్వకేట్ జనరల్ గారు రేపటికైనా అడిగారు ముందు రేపటికైనా ఇచ్చారు అంటే శుక్రవారం కానీ తర్వాత కోర్టే Thursday వచ్చే Thursday కేస్ పోస్ట్ చేశారు... ఎందుకంటే Monday రోజు కొత్త చీఫ్ జస్టిస్ గారు చూస్తారు కాబట్టి Monday కూడా వీలుపడదు...
అందుకని Thursday కేసు పోస్ట్ చేశారు... ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళది విత్ డ్రా చేసుకుంటారా రూల్స్ లేదా కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా అనేది ఆ రోజు తెలుస్తుంది. పోకల శేఖర్ TNSTA State President.M. sakkubai. TNSTA State General Secretary
..............................................................................
ఈరోజు 20-07-2023 కోర్ట్ లో వాదనలు GO 5 చట్టబద్దత మీద జరిగినై, AG గారు ఆర్టికల్ 309 ప్రకారం కాకుండా, ఆర్టికల్ 162 ప్రకారం GO ఇవ్వబడింది అని చెప్పగా, జడ్జ్ గారు అలా ఉన్న revised instruction తో రమ్మని చెప్పారు
పిటిషనర్ ల తరపున PV కృష్ణయ్య గారు GO 5 చట్టబద్దత, మరియు యూనియన్ నాయకుల OD, పాయింట్స్ గురించి మరియు SPOUSE పాయింట్స్ గురించి మాట్లాడుతూ యూనియన్ నాయకులు, OD సౌకర్యం వల్ల పని చేయకుండా శాలరీ తీసుకుంటున్నారు, అని, SPL POINTS వల్ల ట్రాన్స్ఫర్స్ లో లబ్దిపొందుతున్నారు అని చెప్పారు
ఈరోజు చట్టబద్దత గురించి మాత్రమే వాదనలు జరిగినై
REVISED INSTRUCTION తో AG గారిని హాజరు కావాలి అని ఒక వారం, (నెక్ట్స్ గురువారానికి) వాయిదా వేశారు
No comments:
Post a Comment
Need Suggestions