📡ఈ FLN కార్యక్రమం లో చేపట్టవలసినవి.✍️
➡️ప్రారంభ పరీక్ష (Baseline test) నిర్వహించాలి.
పిల్లల స్థాయిని గుర్తించాలి.
స్థాయికి అనుగుణంగా బోధనా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం
- వార్షిక ప్రణాళిక.
- వారపు/పాఠ్య ప్రణాళిక.
- పీరియడ్/కాలాంశ ప్రణాళిక
తరగతి గదుల్లో బోధనా ప్రణాళిక ప్రకారం బోధించడం.
5+1 - అనగా 5 రోజుల బోధనా + 1 రోజు మూల్యాంకనం చేయాలి
పిల్లల ప్రగతిని 'మాసమునకు ఒకసారి నమోదు చేయాలి.
ప్రతి మాసానికి ఒక సారి పిల్లల ప్రగతిని సమీక్ష చేయాలి.
Complex స్థాయిలో ఉపాధ్యాయుల వారిగా సమీక్ష ఉంటుంది.
మాసానికి ఒక సారి H.Mల సమీక్ష ఉంటుంది (మండల స్థాయిలో)
జిల్లాస్థాయిలో మండల స్థాయి ప్రగతి గురించి సమీక్ష ఉంటుంది.
రాష్ట్ర స్థాయిలో జిల్లా సమీక్ష అంశాల ఆధారంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు.
అవసరమైన అంశాల ఆధారంగా శిక్షణ కార్యక్రమలు నిర్వహిస్తారు.
మండల స్థాయినుండి జిల్లా స్థాయివరకు పర్యవేక్షణ (Monitoring) కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment