పదవ తరగతి ముస్లిం విద్యార్థినులకు శుభవార్త
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ముస్లిం విద్యార్థినులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పంది. పదో తరగతి పరీక్షలకు బుర్ఖా ధరించి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బుర్ఖాలను తొలగించాలని కోరవద్దని సూచించింది. అయితే ఆ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా టీచర్‌ను ఏర్పాటు చేసి నిషేధిత వస్తువులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్(సీఎస్‌డీవో) అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
No comments:
Post a Comment