SIR లో మీ పేరు నమోదు అయ్యిందా? 1950కి SMS చేసి వెంటనే తెలుసుకోండి | EPIC Verification 2026

SIR లో మీ పేరు అప్లోడ్ అయ్యిందా? 1950కి ఒక SMS పంపి వెంటనే తెలుసుకోండి



ఎన్నికల సంఘం (ECI) అందిస్తున్న SMS సేవ ద్వారా మీ SIR నమోదు పూర్తయ్యిందా లేదా అనేది కొన్ని సెకన్లలో తెలుసుకోవచ్చు. BLO మీ వివరాలను SIRలో నమోదు చేశారా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మీ మొబైల్ నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు.

SIR నమోదు స్థితి ఎలా చెక్ చేయాలి?

  • మీ మొబైల్‌లో Messages ఓపెన్ చేయండి.
  • ECI అని టైప్ చేసి ఒక స్పేస్ ఇవ్వండి.
  • ఆ తర్వాత మీ EPIC Number (Voter ID Number) టైప్ చేయండి.
  • ఈ మెసేజ్‌ను 1950 నంబర్‌కు పంపండి.
ఉదాహరణ:

ECI YOJ7337135

ఈ మెసేజ్‌ను 1950కు పంపండి.

SMS పంపిన తర్వాత ఏమవుతుంది?

  • మీ ఓటర్ వివరాలు వెంటనే వస్తే, మీ వివరాలు SIRలో నమోదు అయినట్లే.
  • ఎలాంటి సమాచారం రాకపోతే, మీ BLO ఇంకా మీ SIR ఫారమ్‌ను అప్లోడ్ చేయలేదని అర్థం.
గమనిక:
SMS పంపేటప్పుడు EPIC Number సరిగ్గా నమోదు చేయాలి. అప్పుడు మాత్రమే సరైన సమాచారం అందుతుంది.

SIR నమోదు ఎందుకు ముఖ్యమైనది?

SIRలో మీ వివరాలు సరిగ్గా నమోదు కావడం వల్ల ఎన్నికల జాబితాలో మీ సమాచారం సక్రమంగా ఉంటుంది. భవిష్యత్తులో ఓటింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ముందుగానే ఈ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం మంచిది.

ముఖ్యాంశాలు

  • ECI + Space + EPIC Number టైప్ చేయండి.
  • 1950కు SMS పంపండి.
  • వెంటనే మీ SIR నమోదు స్థితి తెలుసుకోండి.

No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner