Go.317 సబ్ కమిటీ సమావేశం ముఖ్య అంశాలు
ఈరోజు 10/07/2024 వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు మరియు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ శ్రీ దామోదర రాజనర్సింహ గారితో జరిగిన సమావేశంలో మంత్రిగారు జూలై 15 కల్లా అన్ని డిపార్ట్మెంట్ లతో చర్చించి అన్ని వేకెన్సీస్ గురించి ఆరా తీసి ఫైనల్ రిపోర్ట్ ను సీఎం గారికి సబ్మిట్ చేస్తామని హామీ ఇచ్చారు...
అవసరం అయితే పోస్ట్ సంఖ్య పెంచుతామని కూడా చెప్పారు
PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు హర్ష వర్ధన్ అన్న గారు దగ్గరుండి మన సమస్య ను తప్పకుండా పరిష్కరించే వరకి నేను అన్ని విషయాలు చూసుకుంటాను అని తెలిపారు..
మన మన 317 రాష్ట్ర కమిటీ తరఫున మంత్రి గారికి సన్మానించి పెన్ను బహుకరించి అదే పెన్నుతో సంతకం చేసి మన యొక్క జీవితాలను తిరిగి సంతోషమయం చేయాలని కోరడం జరిగింది.*
ఈ సమావేశంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి గారు , ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ గారు,317 బాధిత రాష్ట్ర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
317 బాధితులకు న్యాయం చేయడం కోసం నిద్రాహారాలు లెక్కచేయక అహర్నిషలు కృషి చేస్తున్న హర్షన్న కు ధన్యవాదములతో.
🙏🙏🙏🙏
- 317 బాధిత రాష్ట్ర కమిటీ.
No comments:
Post a Comment