CM MEETING WITH EMPLOYEE & TEACHERS ORGANIZATIONS UPDATES

GO. MS. No. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన GO. MS. No. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

 హాజరైనా మంత్రులు D. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.
క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ జీవో నెంబర్లు 317, 46 ల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
*సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ  ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జీవో 317 లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం.

317 జీవోపై వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను, ఎదుర్కొంటున్న సమస్యలపై, వినతుల పై ఈనెల 14వ తేదీ సాయంత్రం స్వీకరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం. 

317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
*ఫిర్యాదులను స్వీకరించడానికి గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర సర్వీసెస్ శాఖ సెక్రెటరీ గారికి ఆదేశం.

ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ వెల్లడి.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మా గారి అధ్యక్షతన GO. MS. No. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ముఖ్య అధికారులు  పాల్గొన్నారు. 
క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వల్ల ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు సబ్ కమిటీ చైర్మన్ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.
జీవోలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.


జీవో నెంబర్ లు 317, 46 ల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై, పలు అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. జీవో నెంబర్లు 317 , 46 లోని లోటుపాట్లు, పలు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి చర్చించడం జరిగింది. 317 జీవో సంబంధించి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలను, వినతులను కమిటీ ముందు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని సబ్ కమిటీ ఆదేశించింది. అందుకు అన్ లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించాలని కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి సమస్యలను అభిప్రాయాలను తెల్పడానికి ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్  ను సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆదేశించారు. 

గ్రీవెన్స్ సెల్ కు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల శాఖ సెక్రెటరీ గారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. 317 జీ వో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల,  ఉపాధ్యాయుల సమస్యల ను పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులకు స్పష్టం చేశారు.


ఈ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, PRC కమిటీ చైర్మన్ శివ శంకర్, సెక్రటేరియట్ సర్వీసెస్ సెక్రెటరీ నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన, శృతి ఓజా డైరక్టర్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM MEETING WITH EMPLOYEE & TEACHERS ORGANIZATIONS UPDATES



🔵పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్.

🟣 పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ను నియమిస్తాం.

 🟢ఆర్టీసీ సంఘాల ఎన్నికలు నిర్వహిస్తాం.

🟨 2008 DSC బిఈడి అభ్యర్థుల ఉద్యోగాలపై 12న జరిగే క్యాబినెట్ లో నిర్ణయం.

 🟦ఇటీవల జరిగిన నియామకాల్లో 43% మహిళలు ఎంపికయ్యారు.

🟫జి.ఒ 317 సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం.

⬛ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తుంది.

🟩సంఘాలు ఉండాల్సిందే. సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది. అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం.

🟥రెగ్యులర్ పోస్టుల్లో రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి ప్రమోషన్స్ కు ఆటంకం లేకుండా చూస్తాం. రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ఒఎస్డీ లు గా నియమించుకుంటాం.

🟤కోదండరామ్ ను ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపిస్తాం.

          -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి





Join ourGroups
WhatsApp Group,Join Now
Telegram GroupJoin Now

No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner