5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి
తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదురుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పింది.
గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన సమాచారం:
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సంస్థలచే నడుపబడుచున్న (638) గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి (ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్ సిలబస్) లో ప్రవేశానికి దరఖాస్తులు కోరబడుచున్నవి ప్రవేశ పరీక్ష తేదీ 23.04.2023 నాడు ఉదయం 11:00 గం॥ల నుండి మధ్యాహ్నము 1:00 గం॥ ల వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించబడిన అన్ని జిల్లా కేంద్రాలలో, పరిసర ప్రాంతాలలో నిర్వహించబడును
No comments:
Post a Comment