డియర్ ఫ్రెండ్స్,
ఈసారి సంక్రాంతి సెలవులు కేవలం ఐదు రోజులు మాత్రమే. గతంలో యాభై ఏళ్లుగా పది రోజులు ఉన్న సంక్రాంతి సెలవులను తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం ఎందుకు కుదించిందో అర్థం కాదు. ఈ నెల 13 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. TSER ప్రకారం సంక్రాంతి హాలిడేస్ Short Term Holidays గా పరిగణిస్తారు.
FR 82 SR 6 మరియు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్ నంబర్ 815/E1/1999 తేదీ 01.09.1999 ప్రకారం Term Holidays 14 రోజులకు మించినప్పుడు మాత్రమే Vacation గా పరిగణించి Prefix/Suffix కి అనుమతిస్తారు.
ఈసారి సంక్రాంతి Term Holidays కేవలం ఐదు రోజులు మాత్రమే కాబట్టి, Prefix/ Suffix కి అవకాశమే లేదు. కాబట్టి, సంక్రాంతి హాలిడేస్ ని కలుపుకొని ఎవరైనా OCL పై వెళ్లాలనుకుంటే సంక్రాంతి హాలిడేస్ ఐదు రోజులకి కూడా OCL మంజూరు చేయించుకోవాల్సిందే. అయితే, సంక్రాంతి హాలిడేస్ కి ముందు, తర్వాత CL పెట్టుకోవచ్చు.
సంక్రాంతి హాలిడేస్ మరియు Casual Leave కూడా కలిపి పది రోజులకు మించకూడదు. ఒకవేళ మించితే, మొత్తం పీరియడ్ OCL అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసలుకోవాల్సిందిగా టీచర్లు, హెడ్మాస్టర్లను కోరుతున్నా.
No comments:
Post a Comment