మిత్రులందరికీ నమస్కారం🙏🙏
G.O 317 సమస్య పరిష్కారం దిశగా ఆలోచనలు
ఉమ్మడి జిల్లా వారీగా బదిలీలు ఉండే అవకాశం
ఈరోజు ఉదయం గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రరెడ్డి గారిని కలిసి యుఎస్పిసి పక్షాన ఉపాధ్యాయ వర్గాలకు తక్షణమే బదిలీలు ప్రమోషన్లు కల్పించాలని అదేవిధంగా స్థానికత కోల్పోయి వేరే జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులను తక్షణమే వారి స్వంత జిల్లాలకు పంపించిన తర్వాత బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి లేదా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతనైనా ఏర్పడే ఖాళీలలో 317 బాధితులను వారి సొంత జిల్లాలకు కేటాయించి తదుపరి జీరో స్టేషన్ సర్వీస్ తో సాధారణ బదిలీలు చేయాలని ప్రాతినిధ్యం వహించడం జరిగింది
అందుకు గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి కచ్చితంగా 317 బాధితుల కోసం పరిశీలిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది తదుపరి యూఎస్బీసీ సర్వసభ్య సమావేశంలో కూడా ఇదే విషయంపై సుమారు అరగంట పాటు మన 317 బాధిత సమస్యలను ప్రభుత్వంపై మన యూఎస్బీసీ పక్షాన 317 బాధితులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తూ మన ప్రాధాన్యత అంశాలలో మొదటి ప్రాధాన్యతగా మన 31717సమస్య జీవో అంశాన్ని చేర్చవలసిందిగా కోరడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరపున కూడా 317 ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ ఒక ప్రత్యేక మెమోరాండం ఇవ్వడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలందరినీ పిలిచి మాట్లాడుతూ పరిష్కార మార్గం నిర్ణయిస్తామని తెలియజేయడం జరిగింది
👉🏿అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల చివరి లోపు ట్రాన్సఫర్, ప్రమోషన్,హేతుబద్దీకరణ షెడ్యూల్ రావచ్చు!
👉🏿ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్.
👉🏿గైడ్లైన్స్ సిద్ధం చేస్తున్న అధికారులు.
👉🏿లీగల్ గా ప్రాబ్లెమ్ రాకుండా.. న్యాయ నిపుణుల తో చర్చిస్తున్న అధికారులు.
🙏🙏🙏
No comments:
Post a Comment
Need Suggestions