💥తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి వరుసగా(సోమ,మంగళ,బుధ వారాలు) మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
సోర్స్:T-న్యూస్..
No comments:
Post a Comment