నేటి CM గారి మీటింగ్- మీటింగ్ లోని కీలక అంశాలు
PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిDr పార్వతి సత్యనారాయణ గారు నేటి గౌరవ సీఎం గారి మీటింగ్లో క్రింది అంశాలపై ప్రాతినిధ్యం చేస్తూ మీటింగ్ లోని కీలక అంశాలను తెలియజేయడం జరిగింది
ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, CS శ్రీమతి శాంతి కుమారి IAS గారు, ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు IAS గారు, GAD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శ్రీ మహేష్ దత్ ఎక్కాIAS గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ K కేశవరావు గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1.గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 317 సబ్ కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్నుతెరిచి నేను ఇంకా చదవలేదు, రేపటి రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మీ సమక్షంలో ఓపెన్ చేసి దాని ప్రతులను ప్రతి సంఘానికి అందజేస్తారు, అందులో తెలియజేసిన పరిష్కారాల ప్రకారం ప్రతిదీ వెంటనే అమలు జరుగుతుంది. మిగతా వాటిపై సంఘాలు ఇచ్చే సూచనల ప్రకారం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని సానుకూల పరిష్కారం చేస్తుంది, కావున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి సహకరించాలని కోరడం జరిగింది. స్నేహపూర్వక వాతావరణం లో అందరం కలిసి 317 పరిష్కారం చేయుటకు కృషి చేయాలని కోరడం జరిగింది.*
2. సర్వీస్ రూల్స్ పరిష్కారం కొరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన,గౌరవ IT మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు,గౌరవ ట్రాన్స్పోర్ట్ మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ కే కేశవరావు గారిని నియమిస్తూ త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ కమిటీ ప్రతి రోజు రెండు డిపార్ట్మెంట్ల వారీగా పిలుస్తూ చర్చిస్తూ వీలైనంత త్వరగా నివేదిక అందజేస్తుంది*
3.CPS రద్దు అంశాన్ని సమీక్షించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది . అలాగే 2003 DSC వారికి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మెమో 754,755 లను అమలు చేస్తూ వెంటనే OPS ను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది*
4.KGBV/SSA ఉద్యోగులకు MTS అమలు చేయడానికి నివేదికను తెప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వం సానుకుల నిర్ణయం తీసుకుంటుంది .
5. అన్ని రకాల గురుకులాలను ఒకే డైరెక్టరేట్ పరిధిలోనికి తీసుకురావాలని కోరగా సానుకూలంగా స్పందించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 317 అమలు చేస్తూ, మోడల్ స్కూల్ మరియు గురుకుల సిబ్బందికి 010,2202 హెడ్ ద్వారా వేతనాలు ఇవ్వడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.
6. అప్గ్రేడషన్ కాకుండా మిగిలిన leftover భాషా పండితులు మరియు PET లకు అప్గ్రేడషన్ చేయడానికి సానుకూలంగా స్పందించారు.
7. పదివేల PSHM పోస్టుల మంజూరీకి తక్షణం నివేదిక రూపొందించి పదోన్నతులు పూర్తి చేయాలని కోరగా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.
8. పెండింగ్ బిల్స్ ను దశలవారీగా విడుదల చేస్తున్నామని తెలియజేశారు.
9. రేపు గౌరవ ఆర్థిక మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారితో చర్చించి పెండింగ్ DA ల విషయం రేపు తెలియజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఆశాభావంగా ఉన్నది
No comments:
Post a Comment