జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం 26-07-2024
317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది.
క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ,రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు.
317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
ఈరోజు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించినా ... మరికొన్ని శాఖల నుండి 317 జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
317 జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 నుండి 40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృత్తం అయినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించింది.
క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వెసులుబాటుకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిం చాలానే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని వారి వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో కమిటీ దృష్టికి తెచ్చారు.
ఎవరికైతే 317 జీవో లో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, GAD ముఖ్య కార్యదర్శి మహేష్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, శివశంకర్ PRC చైర్మన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, ప్రిన్సిపల్ సెక్రెటరీ నదిమ్ , లా సెక్రెటరీ తిరుపతి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి శ్రీమతి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి N. శ్రీధర్, విద్యా శాఖ సంచాలకులు వెంకట నరసింహ రెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితర వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం 22-07-2024
Go.317 ఆన్లైన్ గ్రీవెన్స్ వెరిఫికేషన్
Go.317 ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియ పరచిన తేదీల్లో సంబంధిత పూర్తి ఆధారాలతో హాజరై వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియ చేయ నైనది
👉 *Medical ground లో అప్లై చేసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికెట్*
👉 *స్పౌజ్ కేటగిరి నందు అప్లై చేసుకుంటే స్పౌజ్ డీటెయిల్స్ మరియు సర్టిఫికెట్*
👉 *నేటివిటీ సంబంధించి అప్లై చేసుకుంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు*
👉 మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయితే వాటి వివరాలు
👉 *మరియు మరే ఇతర కారణం చేత అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళగలరు.*
జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం 22-07-2024
పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీ ఓ పరిష్కారం
జీవో 317 పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు శాఖలపరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు. *పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది*
No comments:
Post a Comment