Pages

ఉచితంగా ఆధార్ update చేసుకొనుటకై డేట్ పొడిగించనైనది

ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం SSUP (myAadhaar) పోర్టల్ ద్వారా ఫీజు ఛార్జీలలో సడలింపు పొడిగింపు -



ఎక్కువ మంది నివాసితులు తమ పత్రాన్ని ఆధార్‌లో అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించడానికి, 15.03.2023 నుండి 14.06.2023 వరకు ఉచితంగా myAadhaar పోర్టల్ (SSUP) ద్వారా ఆధార్‌లో వారి పత్రాన్ని అప్‌డేట్ చేసే నిబంధనను అందించాలని నిర్ణయించారు.


నివాసితుల నుండి వచ్చిన సానుకూల స్పందన మరియు ప్రాంతీయ కార్యాలయాల సిఫార్సుల ఆధారంగా, సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించబడింది, అనగా. 15.06.2023 నుండి 14.09.2023 వరకు. దీని ప్రకారం, https://myaadhaar.uidai.gov.in/ వద్ద myAadhaar (SSUP) పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యం 14.09.2023 వరకు ఉచితంగా కొనసాగుతుంది.

ఇది కాంపిటెంట్ అథారిటీ ఆమోదంతో జారీ చేయబడుతుంది


📡కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేషన్‌ అంశంపై సందేహాలు - సమాధానాలు✍️



Q: ఆధార్ అప్డేట్  అందరికీ ఉందా?

 A: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

Q: కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు?

 A: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్‌ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి.

Q: డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?

 A: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

 Q: 2016 తర్వాత  నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?

 A: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.

 Q: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?

 A: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్‌లు 2023 ఆగస్టు తర్వాత సస్పెండ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Q: ఆధార్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?

 A: ఆధార్ సస్పెండ్ అయితే ఆధార్‌తో లింక్ అయిన అన్ని సర్వీసులూ నిలిచిపోతాయి. అనగా బ్యాంకింగ్, పోస్టల్, గ్యాస్ వంటి అన్నిరకాల సేవలూ ఆగిపోతాయి. స్టేట్ & సెంట్రల్  గవర్నమెంట్  రెండింటి నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆధార్‌తో సంబంధించినవే గనుక అన్ని పథకాలు వర్తించకుండా పోతాయి.

Q: నా ఆధార్‌లో ఉన్న అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అడ్రస్ రెండూ వేరు వేరు.. ఇప్పుడు నేనేం చేయాలి?

 A: సరైన ఆధారాలతో మీ అడ్రస్‌ను అప్డేట్ చేయించుకోవాలి.

Q: ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ చేసుకుంటే మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలా?

 A: అవసరం లేదు.

Q: నా ఆధార్ మా అమ్మవాళ్ల ఇంటి పేరుతో ఉంది. నాకు పెళ్లయిన తర్వాత మా అత్తగారింటి పేరుతో ఆధార్ కావాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలంటే ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి?

 A: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్‌తో మీ ఇంటి పేరు(ఒకవేళ పేరు మార్చుకున్నట్టయితే దాన్ని కూడా) మార్చుకోవచ్చు.

Q: డాక్యుమెంట్ అప్డేట్‌కు ఎంత ఛార్జ్ అవుతుంది?

 A: 50 రూపాయలు

official website link




No comments:

Post a Comment

Need Suggestions

Recent Updates